1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. iit kharagpur student gets rs.1.5 cr pay package

ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి యేడాది జీతం రూ.కోటిన్నర!!

iit
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థికి ఓ కంపెనీ ఒక యేడాదికి కోటిన్న రూపాయలను జీతంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఐఐటీ క్యాంపస్‌లో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో భాగంగా ఈ విద్యార్థికి బంపర్ ఆఫర్ వచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో మొత్తం 27 కంపెనీలు పాలుపంచుకోగా, 163 మందికి అవకాశాలు లభించాయని కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐఐటీ-ఖరగ్‌పూర్ ఛైర్మన్ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ బరారీ తెలిపారు. 
 
ఈ యేడాది ఓ భారత ఐఐటీ విద్యార్థికి లభించిన అత్యధిక వేతన ఆఫర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఆఫర్ విదేశాలకు వెళ్లి పని చేసే ఒప్పందంపై ఆ విద్యార్థికి లభించిందని, ఇక మన దేశంలో పనిచేసే విషయానికి వస్తే ఓ విద్యార్థి రూ.42 లక్షల ప్యాకేజి అందుకున్నాడని తెలిపారు. విద్యార్థి వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. మొత్తం క్యాంపస్ ఇంటర్యూల్లో ఇప్పటి వరకు 251 మందికి జాబ్ ఆఫర్లను లభించినట్టు చెప్పారు. ఇందులో 88 మందికి ముందుగా ఆఫర్లు వచ్చాయన్నారు. 
About Writer
PNR