గురువారం, 2 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (20:12 IST)

పునరావృతమయ్యే పనులను ఏఐ చేపట్టడంతో మానవ-కేంద్రీకృత ఉద్యోగాలను స్వీకరిస్తున్న భారతీయ నిపుణులు

jobs
పునరావృతమయ్యే పనులను ఏఐ చేపట్టడంతో, భారతీయ నిపుణులు మానవ తీర్పు, సృజనాత్మకత, సంభాషణలపై ఎక్కువగా ఆధారపడే ఉద్యోగాలలోకి మారుతున్నారు. కస్టమర్ మద్దతు, పరిపాలన విధులకు హెచ్ఆర్ నిపుణులు, కస్టమర్ మద్దతు, అకౌంటింగ్ బాధ్యతలకు ఆర్థిక నిపుణులు, విద్యలో ఉద్యోగాలకు ఇంజనీర్లు మారుతున్నారని లింక్డ్ఇన్ యొక్క సరికొత్త  డేటా చూపిస్తుంది. అదే సమయంలో, కన్సల్టింగ్, వ్యాపార అభివృద్ధి, రియల్ ఎస్టేట్, ఉత్పత్తి నిర్వహణతో సహా వ్యూహాత్మక పరిజ్ఞానం కీలకమైన అధిక-విలువ రంగాలలోకి ఎక్కువ మంది ఉద్యోగులు ప్రవేశిస్తున్నారని లింక్డ్ఇన్ డేటా చూపిస్తుంది. ఇది ప్రత్యేకంగా మానవ సామర్థ్యాలను డిమాండ్ చేసే ఉద్యోగాల వైపు నిపుణులు మారే విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది.
 
ఏఐపై విశ్వాసం ఎక్కువగానే ఉంది. లింక్డ్ఇన్ ఇండియా యొక్క వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ సర్వే ప్రకారం, 62 శాతం మంది భారతీయ నిపుణులు ఏఐ పనులను వేగవంతం చేయడం ద్వారా వారి ఉత్పాదకతను పెంచుతుందని, 59 శాతం మంది తమ కెరీర్‌ అభివృద్ధికి తోడ్పడటంలో దాని సామర్థ్యం పట్ల ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. మీడియా, హెచ్ఆర్, ఇంజనీరింగ్, మార్కెటింగ్ వంటి రంగాలలో, ఏఐని వ్యూహాత్మక, అధిక-విలువైన పనిపై దృష్టి పెట్టడానికి ప్రజలను ముందుకు నడిపించే సాధనంగా ఎక్కువగా చూస్తున్నారు.
 
లింక్డ్ఇన్ కెరీర్ నిపుణురాలు, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నీరాజిత బెనర్జీ మాట్లాడుతూ, ఎవరి కెరీర్‌ను ఏఐ రాయడం లేదు, దాని ద్వారా అది వేగవంతం అవుతోంది. నేడు విజయవంతమైన అభ్యర్థులు మూడు సాధారణ పనులు చేస్తున్నారు. నైపుణ్యాలతో ముందుకు సాగడం, రుజువు చూపించడం, వారి అవకాశాలను విస్తృతం చేసుకోవడానికి ఏఐని ఉపయోగించడం. కాబట్టి, నైపుణ్యాల ఆధారిత అవకాశాల కోసం ఉద్యోగ-శీర్షిక నిర్ణయాలను మార్చుకోండి. ప్రతి వారం లేదా రెండు వారాలకు లింక్డ్ఇన్‌లో మీ పని యొక్క చిన్న రుజువులను ప్రచురించండి. తద్వారా నియామక నిర్వాహకులు మీరు ఎలా ఆలోచిస్తారో చూడగలరు. చివరగా, ఉద్యోగాలను పరిశోధించడానికి, మీ దరఖాస్తులను అనుకూలీకరించడానికి, ఇంటర్వ్యూలను రిహార్సల్ చేయడానికి ఏఐని ఉపయోగించండి, అలాగని సాధారణ సమాధానాలను చెప్పటం కోసం మాత్రం కాదని గుర్తించుకోండి. మానవ తీర్పు, ఏఐ పరపతి యొక్క ఈ మిశ్రమం భారతదేశ యువ నిపుణులు విశ్వసనీయతతో వేగంగా కదలడానికి సహాయపడుతుంది అని అన్నారు.
 
ఎదగడానికి కొత్త మార్గాలను నిపుణులు కనుగొంటున్న వేళ, లింక్డ్ఇన్ యొక్క ఏఐ-ఆధారిత ఉద్యోగ శోధన వారు ఉద్యోగాల కోసం వెతుకుతున్న విధానాన్ని మారుస్తోంది. నిపుణులు తాము వెతుకుతున్న ఉద్యోగాలను గురించి వారి స్వంత మాటలలో వివరించవచ్చు. వారి ఆసక్తులు, నైపుణ్యాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగాలను కనుగొనవచ్చు. ఉద్యోగాలను తెలివిగా కనుగొనడానికి, ఏఐ-ఆధారిత మార్పును స్వీకరించటంలో ముందు ఉండటానికి లింక్డ్ఇన్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి
 
ఉద్యోగ శోధనలో వాల్యూమ్ మీ స్నేహితుడు కాదు
తరచుగా, మీరు ఉద్యోగ వివరణలు చదవడానికి, కంపెనీలను మూల్యాంకనం చేయడానికి సమయాన్ని వెచ్చిస్తారు, అంతా చదివిన తరువాత కానీ అది మీకు సరిపోదని కనుగొంటారు. లింక్డ్ఇన్ యొక్క జాబ్ మ్యాచ్ ఫీచర్‌తో, మీరు మీ ప్రొఫైల్‌లోని నైపుణ్యాలు, అర్హతల ఆధారంగా మీరు ఉద్యోగానికి సరిపోతారో లేదో సెకన్లలో తెలుసుకోవచ్చు.
 
కొత్త అవకాశాలను కనుగొనడానికి తక్కువ కీలకపదాలు, మరిన్ని నైపుణ్యాలు
కొత్త ఏఐ సాధనాలతో, మీరు సరళమైన వాక్యాలు, ముఖ్యమైన వివరాలను ఉపయోగించి ఉద్యోగాల కోసం శోధించవచ్చు. లింక్డ్ఇన్ యొక్క ఏఐ- పవర్ జాబ్ సెర్చ్ సహజ భాషను అర్థం చేసుకుంటుంది. కాబట్టి మీరు స్నేహితుడికి చేప్పినట్లుగా దానికి ఒక వుద్యోగం గురించి వివరించవచ్చు. ఇది మీరు పరిగణించదగిన, సంబంధిత ఉద్యోగాలను అందిస్తుంది.
 
మీ ఆశయం పట్ల స్పష్టంగా ఉండండి, అలాగని మిమ్మల్ని మీరు దానికి పరిమితం చేసుకోకండి
ఏఐ-ఆధారిత ఉద్యోగ శోధన మీ అనుభవం, మీ సామర్థ్యం, మీ లక్ష్యాలతో సమకాలీకరించే ఉద్యోగాలను ముందుంచుతుంది. వీటిలో కొన్ని మీరు ఇంతకుముందు ఆలోచించి ఉండకపోవచ్చు. మీరు పరిగణించని అవకాశాలను వినియోగించుకోవటానికి సిద్ధంగా ఉండండి. నేటి అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ మార్కెట్‌లో వృద్ధి చెందడానికి అనుకూలతను స్వీకరించండి.
 
షార్ట్‌కట్‌లు ఎల్లప్పుడూ సరైన గమ్యస్థానంలో ముగియవు
మీ ప్రత్యేక ప్రతిభ మాదిరిగానే, ప్రతి ఉద్యోగమూ ప్రత్యేకమైనది. మీరు బదిలీ చేయగల నైపుణ్యాలు, నిజమైన అనుభవాలను వెల్లడించండి. మీరు పాత్రకు ప్రత్యేకంగా ఎందుకు సరిపోతారో ప్రదర్శించడానికి ప్రతి అప్లికేషన్‌ను అనుకూలీకరించండి.
 
నకిలీ ఉద్యోగాలు మీరు అనుకున్నంత ప్రబలంగా ఏమీ లేవు
మెజారిటీ ఉద్యోగాలు నిజమైనవి కావు అనే అభిప్రాయం ఖచ్చితమైనది కాదు. నిజమైన జాబితాలను గుర్తించడానికి ధృవీకరణ బ్యాడ్జ్‌ల కోసం చూడండి. సురక్షితమైన, ప్రభావవంతమైన ఉద్యోగ వేట కోసం మీ స్వంత పరిశోధనతో లింక్డ్‌ఇన్ యొక్క భద్రతా లక్షణాలను మిళితం చేయండి.
 
ప్రతి ఒక్కరూ ముందుకు సాగడానికి సహాయపడటానికి, ఏఐ సాధనాలు మీ కోసం పని చేయడంలో స్మార్ట్, ఆచరణాత్మక చిట్కాల కోసం లింక్డ్‌ఇన్ ప్లాట్‌ఫామ్‌లో మీరు అనుసరించగల అత్యుత్తమ ఏఐ వాయిస్‌లను హైలైట్ చేసింది.