ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (11:43 IST)

డౌన్‌లోడ్‌కు సిద్ధంగా TSLPRB Police Constable Hall Ticket 2022

ts police
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 28వ తేదీన రాత పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డులను (హాల్ టిక్కెట్స్) ఈ నెల 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. వీటిని 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు https://www.tslprb.in/ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాస రావు తెలిపారు. 
 
ఈ నెల 28వ తేదీన జరిగే రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జరుగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 6,61,196 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
 
ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో ఏవేని సమస్యలు తలెత్తిన పక్షంలో [email protected] కు ఈమెయిల్‌ లేదా 9393711110, 9391005006 నెంబర్లకు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు.