సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 సెప్టెంబరు 2023 (21:01 IST)

మెడికల్- ఇంజినీరింగ్ కలలకు ఉద్దేశించిన యూఎన్ఎస్ఏటీ 2023 పరీక్షను సిద్ధం చేసిన అన్ అకాడమీ

image
భారతదేశపు అతిపెద్ద లెర్నింగ్ ఫ్లాట్ఫామ్‌గా గుర్తింపు తెచ్చుకుంది అన్ అకాడమీ. ఎంతోమంది విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన చేసి వారి కలలను సాకారం చేసుకునే విధంగా కృషి చేసింది. అంతేకాకుండా అన్ అకాడమీ జాతీయ స్కాలర్ షిప్ అడ్మిషన్ టెస్ట్ (UNSAT) ద్వారా ఐఐటీ, జేఈఈ, నీట్ యూజీ అభ్యాసకులకు ఎప్పటికప్పుడు సహాయసహకారాలను అందిస్తోంది.
 
ఇప్పుడు ఈ టెస్ట్‌ను మూడోసారి నిర్వహిస్తోంది అన్ అకాడమీ. ఇప్పుడు ఈ టెస్ట్‌ను సెప్టెంబరు 08, 2023న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్... నీట్, జేఈఈ పరీక్షలను సాధించాలనుకునే విద్యార్థులకు అద్భుతమైన అవకాశం. దీనిద్వారా విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా పెంచుకుని, నీట్ మరియు జేఈఈ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. 
 
యూఎన్ఎస్ఏటీ 2023 పరీక్షకు సంబంధించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
 
పరీక్ష తేదీలు: అక్టోబరు 1, 8 మరియు 15, 2023 (రెండు స్లాట్లు: మధ్యాహ్నం 1- 2 గంటల వరకు మరియు సాయంత్రం 6-7 గంటల వరకు)
పరీక్ష విధానం: ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్
అర్హత ప్రమాణాలు: 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, 12వ తరగతి పాస్ అయినవాళ్లు మరియు ఐఐటీ & నీట్  పరీక్షకు సిద్ధం అవుతున్నవాళ్లు
పరీక్ష ఫీజు: ఆన్ లైన్-ఉచితం, ఆఫ్ లైన్- రూ. 100
ఫలితాల ప్రకటన: నవంబరు 2, 2023
యూఎన్ఎస్ఏటీ 2023 పరీక్షకు సంబంధించి మరిన్ని వివరాల కోసం, అలాగే రిజిస్ట్రేషన్ వివరాల కోసం దయచేసి సంప్రదించండి unsat.unacademy