శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (12:13 IST)

యూపీఎస్సీ 2023 పరీక్షల కాల నిర్ణయ పట్టిక విడుదల

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వివిధ రకాలైన పోటీ పరీక్షలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. ఇందులోభాగంగా, 2023 సంవత్సరానికిగాను యూపీఎస్పీ పరీక్షల కాల నిర్ణయపట్టిక (ఎగ్జామ్ క్యాలెండర్)ను తాజాగా విడుదల చేసింది. 
 
యూపీఎస్సీ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష 2023, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష 2023ను వచ్చే యేడాది మే 28వ తేదీన నిర్వహిస్తారు 
 
అయితే, ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్‌ను వచ్చే యేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన జారీచేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఫిబ్రవరి 21గా నిర్ణయించారు. అయితే, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ తేదీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 
 
అలాగే, యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షను 2023 సెప్టెంబరు 26న నిర్వహిస్తారు. ఇది ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. ఐఎఫ్ఎస్ పరీ 2023 నవంబరు 23న నిర్వహిస్తారు. అలాగే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్ష 2023 ఫిబ్రవరి 19న, కంబైన్డ్ జియో సైంటిస్ట్ (మెయిన్స్) పరీక్షను 2023 జూన్ 24న నిర్వహిస్తారు. 
 
వీటితో పాటు ఎన్డీఏ ఎన్ఏ-1, సీడీఎస్-1 2023 నోటిఫికేషన్‌ను 2023 డిసెంబరు 21వ తేదీన జారీచేస్తారు. ఈ రెండు పరీక్షలను 2023 ఏప్రిల్ 16వ తేదీన నిర్వహిస్తారు. ఎన్డీఏ-2, సీడీఎస్-2 కోసం నోటిఫికేషన్ 2023 మే 17న విడుదల చేయనుండగా, పరీక్ష మాత్రం 2023 జూన్ 6వ తేదీన నిర్వహిస్తారు.