1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మే 2024 (11:06 IST)

బైకుకు నెంబర్ ప్లేట్ లేదు.. చైన్ స్నాచర్లుగా కాలేజీ స్టూడెంట్లు.. మహిళ వద్ద? (video)

College students
College students
చెన్నైలో దోపీడీలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న అరక్కోణం రైలులో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ ఆటో డ్రైవర్ లాక్కున్న ఘటన మరవకముందే.. కాలేజీ స్టూడెంట్లు చైన్ స్నాచర్లుగా మారిన ఘటన కలకలం రేపుతోంది.
 
పట్టపగలే ఇద్దరు యువకులు ఓ మహిళ బంగారు గొలుసును దోచుకుని పారిపోయారు. రుయ్యు మంటూ వెళ్లిన ఆ బైకులో ఇద్దరు యువకులు వుండగా, ఆ బైకులో నెంబర్ ప్లేట్ లేదు. రోడ్డుపై నడుస్తూ వెళ్లిన బ్లూ రంగు చీర కట్టిన మహిళ వద్ద బంగారు గొలుసు దోచుకుని పారిపోయారు. 
chain snatchers in chennai
chain snatchers in chennai
 
అయితే నెంబర్ ప్లేట్ లేకపోయినా పర్లేదని.. షూ కలర్‌ను బట్టి పోలీసులు ఆ ఇద్దరు కాలేజీ స్టూడెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.