గురువారం, 8 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 9 జులై 2016 (13:40 IST)

వాణియంబాడిలో వింత.. నరికిన మామిడి కొమ్మకు ఒకటి కాదు.. ఏకంగా 25 మామిడి కాయలు!

ఈ లోకంలో వింతలకు విశేషాలకు కొదవే లేదు. అసలు విషయం ఏంటంటే... వేలూరు జిల్లా వాణియంబాడి సమీపంలో నరికిన మామిడి కొమ్మ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25కి పైగా కాయలు కాసి గ్రామస్థులను ఆశ్చర్యానికి గురి చే

ఈ లోకంలో వింతలకు విశేషాలకు కొదవే లేదు. అసలు విషయం ఏంటంటే... వేలూరు జిల్లా వాణియంబాడి సమీపంలో నరికిన మామిడి కొమ్మ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25కి పైగా కాయలు కాసి గ్రామస్థులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాణియంబాడి ఆలంకాయం కలరపట్టి ప్రాంతానికి చెందిన మాజీ ప్రధానోపాధ్యాయుడు పడవేట్టానకు చెందిన మామిడి తోటలోని ఓ వృక్షం కొమ్మను ఈ మధ్యనే నరికేశారు. 
 
నరికిన కొమ్మకు కాయలు కాయడం అసాధ్యం. అలాంటిది కొమ్మకు 25కు పైగా కాయలు కాశాయి. సాధారణంగా కొమ్మలను తీసుకుంటే అధిక పక్షంగా ఐదు మామిడికాయలు కాస్తాయి. అలాంటిది..నరికిన కొమ్మ నుంచి అధికంగా మామిడికాయలు కాయడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిజంగా ఇదో వింతని గ్రామస్థులు అంటున్నారు.