సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By Selvi
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2017 (16:04 IST)

సమ్మర్ స్పెషల్ : కొబ్బరి నీటితో పాయసం ఎలా చేయాలి?

వేసవి తాపాన్ని తీర్చే కొబ్బరిబొండాంలో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫుల్ ఎనర్జీ కలిగిన ఈ కొబ్బరి నీళ్లలో పొటాషియం, మినరల్స్ ఉన్నాయి. ఇవి అలసటను దూరం చేసి మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి. కొబ్బరి బొండాం

వేసవి తాపాన్ని తీర్చే కొబ్బరిబొండాంలో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫుల్ ఎనర్జీ కలిగిన ఈ కొబ్బరి నీళ్లలో పొటాషియం, మినరల్స్ ఉన్నాయి. ఇవి అలసటను దూరం చేసి మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తాయి. కొబ్బరి బొండాం వంద గ్రాముల నీటిలో 312 మిల్లీ గ్రాముల పొటాషియం, 30 మిల్లీ గ్రాముల మెగ్నీషియం ఉన్నాయి. కొబ్బరిబొండాం నీటిని ఎప్పట్లా కాకుండా ఆ నీటితో పాయసం ట్రై చేయండి. 
 
కొబ్బరి బొండాం నీటితో పాయసానికి కావలసిన పదార్థాలు..  
కొబ్బరి నీరు - అర లీటర్ 
సేమియా - 150 గ్రాములు 
జీడిపప్పు, ద్రాక్ష, బాదం పలుకులు, పిస్తా పలుకులు - అర కప్పు 
గుమ్మడి, కీర విత్తనాలు - 25 గ్రాములు 
బెల్లం - పావు కేజీ 
 
తయారీ విధానం : 
ముందుగా కొబ్బరి బొండాం నీటిని ఓ పాత్రలో పోసి స్టౌమీద పెట్టి వేడి చేయాలి. మరిగాక అందులో దోరగా నేతిలో వేపిన సేమియాను చేర్చాలి. మరోవైపు జీడిపప్పు, బాదం, పిస్తా, కీర, గుమ్మడి విత్తనాలు చేర్చి మిక్సీలో పొడి చేసుకుని పక్కనబెట్టుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత అందులో మిక్సీలో పొడి చేసుకున్న బాదం, పిస్తా పౌడర్‌ను చేర్చుకోవాలి. ఆపై తరిగిన బెల్లం తురుమును కూడా చేర్చుకుని ఐదు నిమిషాల పాటు తెల్లాక దించేయాలి. అంతే కొబ్బరి బొండాం నీటితో పాయసం రెడీ అయినట్లే. ఈ పాయసాన్ని అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచి వేసవిలో కూల్‌గా సర్వ్ చేస్తే టేస్టు అదిరిపోతుంది.