మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By selvi
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (13:42 IST)

పుదీనా పచ్చడితో చపాతీలు తింటే.. పుదీనా టీ తాగితే?

పుదీనా ఆకుల్లోని సువాసన మెదడును ప్రభావితం చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి గుణాలు అధికం. పుదీనా ఆకుల టీని తాగడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే ఓ కప్పు

పుదీనా ఆకుల్లోని సువాసన మెదడును ప్రభావితం చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి గుణాలు అధికం. పుదీనా ఆకుల టీని తాగడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఉదయాన్నే ఓ కప్పు పుదీనా టీ తాగితే.. తద్వారా శరీరానికి కావలసిన పీచు, క్యాల్షియం, పొటాషియం అందుతాయి. ఈ టీ మనస్సు, శరీరానికి ఆహ్లాదాన్నిస్తాయి. 
 
పుదీనా చట్నీని కలిపి రోటీలు చేయడం ద్వారా, చపాతీలు, పరోటాలు తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలాగే క్యాన్సర్ కణుతులు పెరగకుండా వుండాలంటే వారానికి నాలుగు సార్లైనా పుదీనా పచ్చడిని డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు.. వైద్య నిపుణులు. 
 
అలాంటి పుదీనాతో మెదడుకు మేలు చేసే పుదీనా టీ ఎలా తయారు చేయాలో చూద్దాం.. మూడు కప్పుల నీటిలో పదిహేను పుదీనా ఆకుల్ని వేయాలి. బాగా మరిగాక ఒక ఏలక్కాయ, దాల్చినచెక్క వేస్తే టీ రెడీ. ఈ టీని సర్వింగ్ కప్పులోకి తీసుకుని తేనె కలిపి తీసుకుంటే.. టేస్ట్ అదిరిపోతుంది.