గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By Selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (18:44 IST)

సమ్మర్ స్పెషల్.. పుచ్చకాయ జ్యూస్ ఎలా చేయాలి..?

పుచ్చకాయను కట్ చేసుకుని.. వాటిలోని విత్తనాలను తొలగించాలి. ఆపై పుచ్చ ముక్కల్ని మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకుని బౌల్‌లోకి తీసుకుని కాసేపు పక్కనబెట్టాలి. కొద్దిసేపటి తర్వాత పుచ్చకాయ రసంలో గ్రైండ్ చేసిన ఐ

ఆయా సీజన్లో వచ్చే పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని.. కాలానికనుగుణంగా ప్రకృతి మనకు వివిధ రకాల ఫలాలను ఇస్తుంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో వేసవిలో లభించే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి పండ్లు తప్పకుండా ఆహారంగా చేర్చుకోవాలి. వేసవిలో లభించే పుచ్చకాయలో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మనకు లభిస్తాయి. విటమిన్లు, పొటాషియం పుష్కలంగా వున్నాయి. పుచ్చకాయ దాహార్తికి ఎంతగానో ఉపకరిస్తుంది. వడదెబ్బనుంచి  శరీరాన్ని రక్షిస్తుంది. అలాంటి పుచ్చకాయను అలాగే కట్ చేసి తీసుకోవడం బోర్ కొట్టేస్తే జ్యూస్ ట్రై చేయండి. ఎలా చేయాలంటే?
 
కావల్సిన పదార్థాలు:
వాటర్ మెలోన్ - నాలుగు కప్పులు
యాలకల పొడి - అర టీ స్పూన్ 
పెప్పర్ -  ఒక టీ స్పూన్  
ఉప్పు - చిటికెడు 
ఐస్, పంచదార - తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా పుచ్చకాయను కట్ చేసుకుని.. వాటిలోని విత్తనాలను తొలగించాలి. ఆపై పుచ్చ ముక్కల్ని మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకుని బౌల్‌లోకి తీసుకుని కాసేపు పక్కనబెట్టాలి. కొద్దిసేపటి తర్వాత పుచ్చకాయ రసంలో గ్రైండ్ చేసిన ఐస్ క్యూబ్స్, యాలకులు, పంచదార పొడిని కలపాలి. ఆపై పెప్పర్ పౌడర్, ఉప్పు చేర్చి సర్వ్ చేస్తే చల్లచల్లని పుచ్చకాయ స్మూతీ టేస్ట్ చేసినట్లు. ఈ రసంలో గ్రైండ్ చేసిన మామిడి పండు పేస్టు లేదా.. స్ట్రాబెర్రీ పేస్టుకు కూడా యాడ్ చేసుకోవచ్చు.