శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (13:46 IST)

వేయించిన రవ్వలో పెరుగును కలిపి... దోసెలు పోస్తే?

వేసవి కాలం వచ్చేస్తుంది. పెరుగు, మజ్జిగలను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు జీర్ణ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీలైనంత ఎక్కువగా వేసవిలో ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగును

వేసవి కాలం వచ్చేస్తుంది. పెరుగు, మజ్జిగలను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు జీర్ణ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీలైనంత ఎక్కువగా వేసవిలో ఆహారంలో చేర్చుకోవాలి. పెరుగును బాగా చిలక్కొట్టి చక్కెర, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలు కలపాలి. ఈ మిశ్రమంలో తేనె కలపాలి. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో దీనిని తీసుకుంటే చల్లగా ఉంటుంది.
 
రోటీలు మెత్తగా రావాలని చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు పోస్తుంటారు. ఈసారి కొంచెం పెరుగు వేసి చూడండి.. రోటీలు మృదువుగా వస్తాయి, పైగా రుచి కూడా పెరుగుతుంది. వేయించిన రవ్వలో పెరుగును కలిపి కాసేపు ఉంచి తగినంత నీళ్లు పోస్తే రవ్వదోశలు బాగా వస్తాయి. చాలా కూరలలో పాలు పోసి వండుతుంటారు.. కొన్ని గ్రేవీ కూరలలో పెరుగు వేస్తారు. దీనివల్ల కూరకి కొంచెం పులుపు రుచి వస్తుంది.