శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 మే 2021 (18:58 IST)

ఏపీలో కొత్త కరోనా కేసులు 19,412, మృతి చెందినవారు 61

కరోనావైరస్ క్రమంగా చాప కింద నీరులా ఏపీలో విజృంభిస్తోంది. ఈరోజు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 19, 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 61 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 98,214 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. తొలిసారిగా రోజువారీ కేసుల సంఖ్య 4 లక్షలు దాటేసింది. నిన్న ఒక్కరోజే 4,01,993 మందికి పాజిటివ్‌ తేలింది. మరోవైపు మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం 3,523 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 2,11,853కి చేరింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 30 లక్షలు దాటేసింది. ప్రస్తుతం 32,68,710 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,49,89,635 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు ప్రకటన విడుదల చేసింది.