శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (22:28 IST)

ఏపీలో కొత్తగా 30 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 30 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 18,834 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,88,899కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.
 
24 గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 7,163కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 69 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకన్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రంలో 695 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,35,65,062 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.