మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: శుక్రవారం, 19 జూన్ 2020 (17:17 IST)

కరోనాను జయించిన 92 యేళ్ళ బామ్మ, ఎక్కడ?

కరోనా వచ్చిందా.. దేవుడా.. ఇక బతకడం కష్టమే. ఇది చాలామంది అనుకునేది. కరోనా బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ భావిస్తుంటారు. అయితే రోజురోజుకూ కరోనా సోకిన వారిన సంఖ్య పెరిగిపోతోంది. చనిపోయే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. 
 
60 యేళ్ళ పైబడిన వారు, పది సంవత్సరాల లోపు వారు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయితే చాలామంది పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్నారు. భౌతిక దూరాన్ని గాలికొదిలేశారు.
 
అయితే ఆశ్చర్యం మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన ఒక 92 యేళ్ళ వృద్ధురాలు కరోనాను జయించింది. కొడుకు కారణంగా కరోనా రావడంతో వృద్ధురాలిని క్వారంటైన్లో ఉంచి చికిత్స నిర్వహించారు. 14 రోజుల చికిత్స తరువాత ఆమె కోలుకుంది. ప్రస్తుతం నెగిటివ్‌తో ఆమె ఎంతో ఆరోగ్యంగా బయటకు వచ్చింది. 
 
ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. సాధారణంగా వయస్సు పైబడిన వారిలో ఇమ్యునిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. కుమారుడి కారణంగా కరోనా వచ్చినా బాధపడకుండా వైద్యులు ఇచ్చిన సలహాలు, సూచనలతో వృద్ధురాలు కరోనా నుంచి బయటపడింది. తన కుమారుడు కూడా ఆరోగ్యంగా బయటకు రావడంతో ఇద్దరూ కలిసి హోం క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు.