గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (14:40 IST)

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్.. రెండు గ్రూపులుగా వచ్చారు..

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గత నెల రోజుల్లో బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి దాదాపు 3 వేల మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వారి వివరాలను రాష్ట్రానికి కేంద్రం అందించింది. వారిని రెండు భాగాలుగా విభజించారు. మొదటి రెండు వారాల్లో వచ్చిన 1,800 మంది ఒక గ్రూపు, డిసెంబర్‌ 9 నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,200 మందిని రెండో గ్రూపుగా విభజించారు. 
 
మొదటి రెండు వారాల్లో వచ్చిన 1,800 మంది వివరాలు తెలుసుకొని వారిని ఆరోగ్య సిబ్బంది పరిశీలిస్తారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలున్నాయా లేదా గుర్తిస్తారు. వారిని పరిశీలనలో మాత్రమే ఉంచుతారు. రెండో గ్రూపులో ఉన్న 1,200 మందిపై ఇప్పుడు వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. 
 
వారిలో 800 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారేనని అధికారులు వెల్లడించారు. వారిని వెతికే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. వారిలో ఇప్పటివరకు 200 మందిని గుర్తించారు. వారి నుంచి నమూనాలు తీసుకొని ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్‌ వచ్చిందని చెప్పారు.