బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (18:17 IST)

చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు-లాన్​ జౌ నగరంలో లాక్ డౌన్

చైనాలోని పలు నగరాలలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే దేశీయంగా కోవిడ్ వైరస్ స్ట్రైక్ అరికట్టేందుకు దాదాపు 40 లక్షల జనాభా ఉన్న లాన్​ జౌ నగరంలో లాక్ డౌన్ విధించింది.
 
అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు చూసింది ప్రభుత్వం. చైనా లోని వాయువ్య ప్రావిన్స్ గన్స్ రాజధాని అయిన లాన్​ జౌ లో తాజాగా ఆరు కేసులు నమోదు అవ్వగా… చైనా వ్యాప్తంగా సోమవారం 29 కేసులు నిర్ధారణ అయ్యాయి. 
 
మన దేశంతో పోలిస్తే.. ఆ 29 కేసులు తక్కువే అయినప్పటికీ… ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోంది చైనా. ఇందులో భాగంగానే తాజాగా లాన్​ జౌ నగరంలో లాక్ డౌన్ విధించింది.