సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జనవరి 2021 (11:06 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో సున్నా మరణాలు.. తెలంగాణలో..?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో ఇవాళ 535 మంది కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు సంఖ్య 2,87,108కు చేరింది. వీరిలో 2,79, 991 మంది కోలుకున్నారు. మరో 5,571 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 
 
హోం ఐసోలేషన్‌లో 3,418 మంది ఉన్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇవాళ్టివరకు 1,546 మంది మృత్యువాతపడ్డారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 26,590 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 69,51,297 మందికి పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో సున్నాకు కరోనా మరణాలు పడిపోయాయి. కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేయడం ప్రారంభించిన నాటి నుంచి మొదటి సారి సున్నా (0) కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,519 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 326 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 8,82,612కు చేరింది.