సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (08:19 IST)

మహారాష్ట్రపై కరోనా పంజా.. అమరావతిలో కర్ఫ్యూ...

కరోనా వైరస్ మహమ్మారి మహారాష్ట్రపై మళ్లీ పంజా విసురుతోంది. కేసులు పెరుగుతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఐదు జిల్లాలు అమరావతి, అకోలా, బుల్దానా, వాషిం, యావత్మాల్‌‌లలో వారం రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం రాత్రి నుంచి మార్చి 1 వరకు ఇది అమల్లో ఉండనుంది.
 
అలాగే నేటి నుంచి పూణె, నాసిక్ నగరాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నారు. శుక్రవారం నాడు పరిస్థితిని సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. విద్యాసంస్థలను కూడా ఈ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.
 
గత రెండు వారాల్లో కేసులు 2,500 నుంచి ఏడు వేలకు పెరిగాయని, పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సీఎం హితవు పలికారు.
 
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్రంలో సభలు, సమావేశాలను రద్దు చేశారు. తొలుత అమరావతి జిల్లాలో శనివారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్డౌన్‌ అమలు చేశారు. తాజాగా వారం పొడిగించారు. 
 
కాగా, కీలక నగరం పుణెతో పాటు నాసిక్‌లో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు కానుంది. వచ్చే శుక్రవారం సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు వెల్లడించాయి. విద్యా సంస్థలను నెలాఖరు వరకు మూసివేయనున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. 15 రోజుల్లోనే కేసులు 2,500 నుంచి 7 వేలకు చేరినట్లు పేర్కొన్నారు. మరో 8 నుం చి 15 రోజులు పరిశీలిస్తామని.. కేసులు ఇలాగే పెరుగుతుంటే రాష్ట్రమంతటా లాక్డౌన్‌ విధించాలో.. వద్దో నిర్ణయిస్తామన్నారు. 
 
రాజధాని ముంబైలో పాజిటివ్‌లు రెట్టింపునకు మించి వస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనికి సెకండ్‌ వేవ్‌ కారణమా? కాదా? అనేది రెండువారాల అనంతరం తెలుస్తుందన్నారు. లాక్డౌన్‌ వద్దనుకుంటే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.