మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 12 జూన్ 2021 (10:09 IST)

కరోనా టెస్టు, వామ్మో.. ముక్కులో విరిగిన స్క్వాబ్

కరోనా టెస్టు నిర్వహిస్తుండగా వ్యక్తి ముక్కులో స్క్వాబ్ చిక్కుకుపోయిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావు పల్లిలో జరిగింది.

గ్రామ సర్పంచ్ జవ్వాజి శేఖర్ కరోనా పరీక్ష నిమిత్తం వచ్చాడు. టెస్ట్ నిమిత్తం నర్సు స్క్వాబ్ నూ ముక్కులో పెట్టి తీసే  క్రమంలో స్క్వాబ్ ముక్కు లోనే చిక్కుకుపోవడంతో అంతా టెన్షన్ పడ్డారు.

వెంటనే కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రిలో ఎండోస్కోపీ ద్వారా విరిగిన పుల్లను వెలికి తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.