సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శనివారం, 11 జులై 2020 (17:34 IST)

కరోనావైరస్ నియంత్రణ సాధ్యమే డబ్ల్యూహెచ్ఓ

కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.కరోనా మహ మ్మారిని నియంత్రించడం  ఇంకా సాధ్యమేనని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అడ్నోమ్ జెబ్రేస్ చెప్పారు. ఇటలీ, స్పెయిన్, దక్షిణ కొరియా మరియు ముంబైలకు చెందిన ధారావిలను ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ ప్రదేశాలలో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని అయితే వేగంగా చర్యలు అదుపులో వచ్చాయని చెప్పారు. పరిమితులు తొలగించబడిన చోట ఇన్పెక్షన్ పెరుగుతోంది.
 
వేగంగా పరీక్షలు చేసి వేరుచేయడం, రోగులందరికీ చికిత్స చేయడం ద్వారా కరోనా గొలుసును విచ్చిన్నం చేయడం, సంక్రమణను తొలగించడం సాధ్యమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ చెప్పారు. ప్రతి దేశానికి కొన్ని పరిమితులు వున్నాయని, పరిమితులు తొలగించబడుతున్న చోట సంక్రమణ కేసులు పెరుగుతున్నాయని అటువంటి పరిస్థితిలో ప్రజలందరూ బాధ్యతగా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.
 
చైనాలో ఉద్యమించిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిందని తెలియజేసారు. 2019 డిసెంబరు నుండి ప్రపంచంలోని 196 దేశాలలో 1.26 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 5.59 లక్షల మంది మరణించారు. భారతదేశంలో 8.21 లక్షల కేసులు ఉండగా ప్రస్తుతం 22 వేల మంది మరణించారని తెలిపారు.