గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (11:23 IST)

కరోనాకు ఓరల్ ట్యాబ్లెట్లు - అనుమతించిన అమెరికా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్టే వేసేందుకు వీలుగా వివిధ రకాలైన మందులను పలు డ్రగ్ కంపెనీలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు కరోనా వ్యాక్సిన్లను తయారు చేశాయి. ఇపుడు తాజాగా మాత్ర కూడా అందుబాటులోకి వచ్చింది. 
 
అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారిగా కోవిడ్‌పై పోరాటానికి తొలి మాత్రను అనుమతి ఇ్చచింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఎఫ్‌డీఏ) తాజాగా కోవిడ్ పిల్‌కు ఆమోదముద్రవేసింది. కోవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ తయారు చేసిన టాబ్లెట్లకు అనుమతి లభించింది.  
 
కరోనాపై సాగుతున్న పోరాటంలో భాగంగా, ఇప్పటికే వ్యాక్సిన్లను అభివృద్ధి చేసిన ఫైజర్ కంపెనీ... తమ వ్యాక్సిన్లను అనేక ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. అలాగే, చిన్నారులకు కూడా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తుంది. 
 
ఇపుడు పాక్స్‌లోవిడ్ (Paxlovid) పేరుతో కరోనాకు మాత్రలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మాత్రను, తయారీని పూర్తిగా విశ్లేషించిన ఎఫ్.డి.ఏ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.