శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (11:12 IST)

కోవిడ్-19 నుంచి కోలుకున్నా దగ్గు, అలసటగానే ఉంటోందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి జనజీవనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ వైరస్ బారినపడిన వారిపై అది చూపుతున్న ప్రభావం మాత్రం తగ్గుతూ వస్తున్నట్టు కనిపిస్తోందని వైద్యులు కూడా అంగీరిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. 
 
అయితే కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆ వైరస్ ప్రభావం మాత్రం మనుషులపై మరికొంత కాలం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో వైరస్  బారినపడి కోలుకున్న వారు కూడా తమకు అలసటగా ఉంటుందని వైద్యులను సంప్రదిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలోని అనస్థీషియాలజీ మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వైద్యులు కోవిడ్ నుంచి కోలుకున్నవారికి కొన్ని సూచనలు చేశారు. అవేంటో ఇక్కడ వివరించడమైనది.   
 
అలసటగా ఉండడం సాధారణమే:
వైరస్ ఇన్ఫెక్షన్లలో అలసట అనేది సర్వసాధారమైన విషయం. ఎందుకంటే శరీరం సాధారణ సమయాల్లో ప్రవర్తించే తీరుకంటే ఇన్ఫెక్షన్ వచ్చినపుడు చాలా శక్తిని కోల్పోవడం జరుగుతుంది. 
 
ఈ నేపథ్యంలోనే కొంతమంది కోవిడ్ నుంచి కోలుకున్న రోగులు తమకు చాలా అసటగా ఉందని వైద్యులను సంప్రదిస్తున్నారు. ఈ అలసట అనే లక్షణం కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మరికొంత కాలం ఉండవచ్చు.
 
 కాబట్టి కోవిడ్ తర్వాత కూడా అలసటగా ఉన్నట్టయితే మీరు ఈ ఆరు చిట్కాలను ప్రయత్నించడం ద్వారా అలసటను ఎదుర్కోవచ్చు.
 
కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా అలసటగా ఉంటే ఏమి చేయాలి?
 
•  ప్రస్తుతం మీ శరీరంలోని శక్తి స్థాయిలను దృష్టిలో ఉంచుకుని కొత్త టైమ్‌ టేబుల్‌ను ప్లాన్ చేసుకోండి
•  మీ శక్తిని తక్కువగా వినియోగించేందుకు వీలుగా మీరుండే స్థలం / కార్యాలయం / డెస్క్‌ను మరోసారి  పునర్వ్యవస్థీకరించి వినియోగించుకోండి.
 
•  మీరు మీ కోసం సెట్ చేసుకున్న పనుల్లో కూడా ప్రాధాన్యత ప్రకారం పూర్తి చేసుకోండి. మీ అవసరం ఎంత ఉందో అంతే చేయండి. 
 
•  నెమ్మదిగా వెళ్లండి: అదే సమయంలో మిమ్మల్ని మీరు వేగిరపరచుకోండి
 
•  మీరు ఎలా కనిపిస్తున్నారన్నది పట్టించుకోకండి
 
•  శక్తిని పెంచే ఆహారాలు తీసుకోండి. (అరటిపండ్లు, ఆపిల్, నారింజ (లేదా తాజాగా పిండిన నారింజ రసం), గోజీ బెర్రీస్, చిలగడదుంపలు తీసుకోవడం వల్ల త్వరగా శక్తిని పొందవచ్చు. వేడి నీటిలో నిమ్మకాయ, కొంచెం తేనె కలిపి తాగడం ద్వారా కూడా త్వరగా ఉపశమనం కలుగుతుంది. 
 
మీరు తక్కువ శక్తి కలిగి ఉన్నామని భావిస్తున్నట్టయితే నీటిని కూడా సిప్ చేయడం (నిదానంగా తాగడం) వల్ల మరింత ఉత్తేజితంగా అనిపిస్తుంది. కావాలంటే ప్రయత్నించి చూడండి.
 
మీకు దగ్గు మరియు ఎక్కువ శ్లేష్మం (చీమిడి కారడం) ఉంటే ఏమి చేయాలి?
 
పొడి దగ్గును ఎలా తగ్గించుకోవాలి: 
• ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వేడి నీటిలో తులసి ఆకుల కషాయం లేదా వెచ్చని నీటిలో తేనె మరియు నిమ్మకాయ వంటి వెచ్చని పానీయాలు తీసుకుంటూ ఉండాలి.
 
• మద్యం, చక్కెర పానీయాలు మరియు కాఫీలకు కొంతకాలం దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవి మన శరీరంలో డీహైడ్రేషన్ (నిర్జలీకరణానికి)కు కారణమవుతాయి.
 
• నీటిని ఒకేసారి గ్లాసులుగా తీసుకోకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. రోజంతా తరచుగా అలా చేస్తూ ఉండండి.
 
• మీరు నీరు తాగాలనిపించినపుడు మీ దగ్గర కానీ, చుట్టుపక్కల కానీ నీరు లేకపోతే మీ లాలాజలాన్ని కొన్ని సార్లు మింగడానికి ప్రయత్నించండి. మీకు దగ్గు వస్తుంటే లేదా మీ గొంతు పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంటే ఇలా చేయడం వల్ల కొంత మీకు ప్రయోజనం కలుగుతుంది.
 
• రోజుకు రెండు లేదా మూడుసార్లు 10 నుంచి 15 నిమిషాలు ఆవిరి పట్టుకోవడం మంచింది. బయట వాతావరణం పొడిగాను / లేదా చల్లగా ఉంటే మీరు మీ గదిలో తేమను ఉంచవచ్చు.
 
సాధారణ దగ్గు లేదా కఫంతో కూడిన దగ్గును ఎలా మేనేజ్ చేయాలి?
 
• ఆవిరి పీల్చడం అనే ప్రక్రియ ద్వారా కఫాన్ని తగ్గించవచ్చు. ఆ భావన నుంచి బయటపడ వచ్చు. ఇలా ప్రతిరోజు 15 నిమిషాలపాటు కనీసం రెండు లేదా మూడుసార్లు ఆవిరి పట్టుకోండి.
 
• కఫం అనేది ముక్కు లేదా ఛాతిలో ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాకుండా నిద్ర భంగం కూడా కలిగిస్తుంది. ఇది మీరు వైరస్ నుంచి త్వరగా కోలుకోకుండా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
 
• మీరు ఒకవైపై నిద్ర పోకుండా వెనుక వెనుక భాగంలో ఫ్లాట్ ఉండేలా నిద్రించడానికి ప్రయత్నించండి. అంటే మీరు ఎత్తుగా ఉండేవైపు తలపెట్టి కూడా నిద్రపోవచ్చు. (మీ తల కింద రెండు లేదా ఎక్కువ దిండ్లు పెట్టడం) 
 
• ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోండి. అధిక ప్రొటీన్లు ఉండే శక్తివంతమైన డ్రింక్స్ తాగాలి. ఉడకబెట్టిన ఎముకల పులుసు మరియు కూరగాయలు, కాయధాన్యాలతో చేసిన సూప్స్ వంటివి.
 
•  5-7 నిమిషాలు నీటిలో అల్లం, తులసి మరియు నల్ల మిరియాలు వేసి ఉడకబెట్టి తయారు చేసిన కడక్  కూడా మీరు త్రాగవచ్చు.