ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (11:10 IST)

దేశంలో కరోనా దూకుడు : తగ్గని పాజిటివ్ కేసులు - మరణాలు సంఖ్య

దేశంలో కరోనా వైరస్ దూకుడు కొనసాగుతూనేవుంది. అయితే, వారం రోజుల క్రితంతో పోల్చితే ఇపుడు కాస్త మెరుగు అనిపిస్తోంది. ఎందుకంటే.. వారం రోజుల క్రితం ప్రతి రోజూ 60 వేలకు పైగా కేసులు నమోదవుతూ వచ్చేవి. కానీ, ఇపుడు 55 వేలకు పడపోయాయి. గత 24 గంటల్లో 55,079 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 876 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,02,743కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 51,797కి పెరిగింది. ఇక 6,73,166 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,77,780 మంది కోలుకున్నారు. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,682 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,070  మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఆసుపత్రుల్లో 21,024 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 72,202 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 711 కి  చేరింది. జీహెచ్‌ఎంసీలో 235 మందికి కొత్తగా కరోనా సోకింది.