సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 19 నవంబరు 2021 (12:40 IST)

తగ్గుతున్న కరోనా కేసులు, పెరుగుతున్న రికవరీ రేటు

గత 24 గంటల్లో భారతదేశంలో 11,106 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే 459 మంది కరోనా కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తన తాజా బులిటెన్లో తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 4,65,082కు పెరిగింది.

 
గత 24 గంటల్లో 12,789 మంది రోగులు కోలుకోవడంతో వారి సంఖ్య 3,38,97,921కి పెరిగింది. ఫలితంగా భారతదేశం రికవరీ రేటు 98.28 శాతంగా ఉంది. ఇది మార్చి 2020 నుండి అత్యధికం. యాక్టివ్ కేసుల సంఖ్య 1,26,620 వద్ద ఉంది.

 
ప్రస్తుతం దేశంలోని మొత్తం పాజిటివ్ ఇన్‌ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.37 శాతంగా ఉన్నాయి. ఇది మార్చి 2020 నుండి అత్యల్పంగా ఉంది.