గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (14:21 IST)

నెల్లూరు పేషీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వద్ద పనిచేసే డీఈవో వాసు కరోనాతో మృతి

నెల్లూరు జిల్లా మంత్రి మేకపాటి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ (డీ.ఈ.వో)గా విధులు నిర్వహించే వాసు(46) మృతి మృతి చెందడంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటంలో నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వాసు ఇవాళ మనమధ్య లేరన్న విషయం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

నెల్లూరు జిల్లా జీజీహెచ్లో వైద్యం పొందుతున్న వాసుకి రెమిడిసివర్ ఇంజెక్షన్ల వంటి అత్యవసర వసతులు సమకూర్చినా కాపాడుకోలేకపోయామని  మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.