మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 మే 2021 (12:05 IST)

కరోనా వైరస్ కొత్త లక్షణం... కోవిడ్ టంగ్.. నాలుక రంగు మారుతుందట.. దురద కూడా..?

కరోనా వైరస్ కొత్త రూపాలు మార్చుకుంటోంది. మొదటి కరోనా వైరస్ కంటే ఇప్పుడు పుట్టుకొచ్చిన కరోనా కొత్త వేరియంట్లలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాల్లో ఇప్పటివరకు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, జలుబు, వాసనతో పాటు రుచి తెలియకపోవడం కొందరిలో కళ్లు ఎర్రబారడం వంటివి కరోనా లక్షణాలుగా గుర్తించారు. కొత్త కరోనా స్ట్రెయిన్లతో కొత్త లక్షణాలు వచ్చి చేరుతున్నాయి.
 
ఈ కొత్త కరోనా రకాలతో చాలామందిలో నోరు ఎండిపోవడం, నాలుకపై గాయాలు, నాలుక దురదగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కరోనా కొత్త లక్షణాన్ని 'కొవిడ్‌ టంగ్‌'గా పిలుస్తున్నారు. 
 
ఈ కొత్త లక్షణాలు కనిపించిన వారిలో ఎక్కువగా నీరసం, విపరీతమైన అలసట ఉన్నట్లు గుర్తించారు. వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. ఈ రెండు లక్షణాలు కనిపిస్తే.. వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. కొత్త కరోనా రకాల వల్లే ఈ కొత్త కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ లక్షణాలపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.
 
కోవిడ్‌ టంగ్‌ లక్షణాలు ఉన్నవారిలో తొలుత నాలుకపై మంట పుట్టడం, దురదగా అనిపించడం, స్వల్ప నొప్పి, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొన్ని కేసుల్లో స్వల్ప గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కొంతమందిలో జ్వరం ఉండటం లేదు.. నీరసంగా అనిపిస్తుందని తెలిపారు. ఇలాంటి లక్షణాలు లేకపోయినా అనుమానం వస్తే వెంటనే కరోనా టెస్టు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.