శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మార్చి 2021 (09:26 IST)

కరోనా సెకండ్ వేవ్ : లాక్డౌన్ దిశగా కర్ణాటక!!

కర్నాకట రాష్ట్రంలోని కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. తొలుత తగ్గినట్టే తగ్గి... మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్‌ ఛాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చి నెలారంభం నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సుమారు 48 రోజుల తర్వాత రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా ఐదు వేల నుంచి ఎనిమిది వేలకు చేరింది. దీంతో కర్నాటకలో మరోమారు లాక్డౌన్ తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. 
 
ఈ యేడాదిలో జనవరి 23వ తేదీన గరిష్టంగా 902 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గత శుక్రవారం 833 పాజిటివ్‌లు వెలుగుచూశాయి. సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. 
 
ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 71 రోజుల తర్వాత 500 సంఖ్య దాటింది. మహరాష్ట్రలో మాదిరిగా లాక్‌డౌన్‌ విధిస్తారేమోనని బెంగళూరుతో పాటు పలు జిల్లాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. 
 
పాజిటివ్‌ కేసుల కన్నా డిశ్చార్జిల సంఖ్య తగ్గడం మహమ్మారి తీవ్రతకు నిదర్శనం. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా కర్ణాటకలో తొలిసారిగా వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించి మార్చి 14నాటికి ఏడాది పూర్తయింది. 
 
కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా కరోనా టీకా వేశారు. శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 9,58,417 ఉంది.