గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 నవంబరు 2021 (10:07 IST)

పదివేలకు చేరిన కరోనా కేసులు.. 488 మంది మృతి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం 10,549 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

అలాగే, గురువారం ఒక్క రోజులో క‌రోనాతో 488 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి మ‌రో 9,868 మంది కోలుకున్నారు.
 
ప్ర‌స్తుతం ఆసుప‌త్రుల్లో క‌రోనాకు 1,10,133 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం కేసుల సంఖ్య‌ 3,45,55,431కు చేరింది. మొత్తం మృతుల సంఖ్య‌ 4,67,468కు చేరింది.