గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (13:38 IST)

దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. 24 గంటల్లో 10వేలకు చేరిన కేసులు

corona
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు ఐదువేల కేసులు నమోదైన కోవిడ్ సంఖ్య.. ప్రస్తుతం పదివేలకు చేరుకుంది. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఎక్స్ బీబీ.1.16 కారణం అని నిపుణులు చెప్తున్నారు. 
 
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,753 పాజిటివ్ కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో, భారత్ లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి చేరింది. నెల రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతున్నాయి. 
 
ప్రస్తుతం ఈ సంఖ్య 50వేల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాకుండా కరోనా కారణంగా 27మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో 5,31,091 మంది కరోనాతో మృతి చెందారు.