శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (12:06 IST)

దేశ వ్యాప్తంగా 87 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కరోనా వ్యాక్సిన్ ముమ్మరంగా సాగుతోంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 87,20,822 మందికి కరోనా టీకాలు వేశారు. ఈ డ్రైవ్ ముగిసిన తర్వాత వృద్ధులకు టీకాల పంపిణీ చేపట్టనున్నారు. 
 
మరోవైపు, దేశంలో మరో 9121 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా వైరస్ సోకింది. అదేస‌మ‌యంలో 11,805 మంది కోలుకోగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరింది.
 
ఇకపోతే, గడచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,33,025 మంది కోలుకున్నారు. 1,36,872 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. 
 
అదేవిధంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 87,20,822 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,73,32,298 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,15,664 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.