మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మే 2020 (17:34 IST)

2 వారాలు కాదు.. నెల మొత్తం.. జూన్ వరకు కొనసాగనున్న Lockdown 4.0?

రైల్వే సేవలు జూన్ 30 వరకు రద్దు అయిన నేపథ్యంలో లాక్ డౌన్ జూన్ వరకు పొడిగించే అవకాశం వుందనే అనుమానం ప్రజల్లో తలెత్తుతోంది. ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్, మెయిల్ వంటి ఇతరత్రా రైళ్ల రాకపోకలు సాగవని, జూన్ 30వ తేదీ వరకు రైలు ప్రయాణీకులు చేసిన రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా ప్రయాణీకులకు రిజర్వేషన్ రద్దు కారణంగా డబ్బును తిరిగి చెల్లించింది. 
 
కానీ శ్రామిక్ రైళ్లు మాత్రం నడుస్తాయని కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే 17వ తేదీతో మూడో లాక్ డౌన్ ముగియనున్న తరుణంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నాలుగో లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగో లాక్ డౌన్‌లోని మార్పులను 18వ తేదీ ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రూ.20 లక్షల కోట్ల పథకాలను ప్రజలకు మెల్ల మెల్లగా వివరిస్తున్నారు. 
 
ఇలాంటి తరుణంలో జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫలితంగా నాలుగో విడత లాక్ డౌన్ మునుపటిలా రెండు వారాలు కాకుండా జూన్ నెల మొత్తం వుంటుందని కూడా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూడో విడత లాక్ డౌన్‌లో సడలింపులు చేశారు. దీంతో కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో నాలుగో లాక్ డౌన్‌ గురించిన వివరాల కోసం ప్రజలు వేచి చూస్తున్నారు.