గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (13:00 IST)

దేశంలో భారీగా తగ్గినా కేసులు - 3 నెలలు తర్వాత 50 వేలకు దిగువకు...

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా, గత మూడు నెలల తర్వాత కొత్త కరోనా పాజిటివ్ కేసులు 43 వేల కంటే దిగువకు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,640  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్ర‌క‌టించింది.
 
ఈ ప్రకటన మేరకు 24 గంటల్లో 81,839 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861కు చేరింది. మరో 1,167 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,89,302కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,89,26,038 మంది కోలుకున్నారు. 6,62,521 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 28,87,66,201 డోసులు ఇచ్చారు.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,40,72,142 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,64,360 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.