శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (14:18 IST)

ఏపీలో మాస్కుల ధరించడం తప్పనిసరి : ఆరోగ్య శాఖ ఆర్డర్

ఏపీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్యా, ప్రజలంతా ముందు జాగ్రత్తలు, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య శాఖ కోరుతోంది. మాస్క్ ధరించటం, శానిటైజర్‌ వాడటం, మనిషికీ మనిషికీ మధ్య దూరాన్ని తప్పనిసరిగా పాటించటంతో పాటు గుంపులుగా లేదా సామూహికంగా ఉండటం వంటివి చేయరాదని, ఈ సూచనలు అన్నీ కోవిడ్ నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడతాయని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 
 
అంతేకాక, ఏ మతస్తులైనా.. వారివారి మతపరమైన సమావేశాల్లో, ప్రార్థనా సమావేశాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కూడా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలన్నింటినీ ఎవరికి వారు స్వీయ బాధ్యతగా పాటించాలని, అలాగే సాటి మనుషుల పట్ల, వారి ప్రాణాల పట్ల కూడా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను పాటించాలని ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.