గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (09:34 IST)

భారత్‌లో కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్‌ కేసు.. అలెర్ట్

corona Virus
భారత్‌లో కొత్త వేరియంట్ నమోదైంది. కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసు భారత్‌లో వెలుగుచూసినట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్‌(ఐఎన్ఎస్ఏసీవోజీ), సార్స్ సీవోవీ2 వైరస్‌కు చెందిన బులిటెన్‌ను విడుదల చేసింది.
 
అయితే, భారత్‌లో నమోదైన తొలి ఎక్స్‌ఈ వేరియంట్‌ కేసు ఎక్కడ వెలుగు చూసింది అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇక, గత వారంతో పోలిస్తే, 12 రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తుండగా.. 19 రాష్ట్రాల్లో మాత్రం కేసులు తగ్గాయి.
 
మరోవైపు, అనుమానిత రీకాంబినెంట్ స్వీక్వెన్సింగ్‌కు సంబంధించిన తదుపరి విశ్లేషణలో ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు ఎక్స్‌ఈ క్లస్టర్‌ నివేదికలు లేవు. ఏప్రిల్ 18 బులెటిన్‌లో, ఐఎన్ఎస్ఏసీవోజీ దేశంలో ఒక ఎక్స్‌ఈ వేరియంట్ కేసును ప్రస్తావించింది. 
 
కానీ, ఇప్పుడు నిర్ధారణ జరిగింది. ఇక, ప్రభుత్వం  అప్రమత్తమైంది. తాజా, బులెటిన్ ప్రకారం, INSACOG మొత్తం 2,43,957 నమూనాలను పరిశీలించింది.