శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (14:17 IST)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరోనా కలకలం.. తణుకు ఎమ్మెల్యేకు పాజిటివ్

Tanuku MLA
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. కరోనా మహమ్మారి అసెంబ్లీని కూడా తాకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావుకి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయన రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు ఇదే విషయం అసెంబ్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు రోజులుగా ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ఇదిలా ఉంటే తనకు కరోనా సోకినట్లు తేలడంతో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వరరావు హాజరు కావడం లేదు. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు సైతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.
 
ఇదిలా ఉంటే, ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది. కొత్తగా నలుగురు వ్యక్తులు కరోనా వల్ల మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 6,996కి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.