మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (18:41 IST)

నేను కూడా మాస్క్ ధరిస్తున్నా, అందుకే: సీఎం కేసీఆర్

మాస్కు ధరించిన కేసీఆర్
దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు చెప్పారు.

అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరికి లక్షణాలు కనిపించినా పరీక్షలు నిర్వహించాలనీ, పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్ట్స్ వివరాలు సేకరించి, వారికీ పరీక్షలు నిర్వహించాలి. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు ఎక్కువ చేయాలి. నియంత్రణ పెంచాలన్నారు.
 
ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షలు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇది వారి కోసం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం చెబుతున్న మాటలు. ప్రజల నిరంతర అప్రమత్తత, స్వీయనియంత్రణపైనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం అవుతుందని చెప్పారు.
 
కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో మాస్క్ ధరించడం, సానిటైజర్ ఉపయోగించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు. 
 
కరోనా వ్యాప్తి నిరోధానికి విరాళం
కరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కలిపి కోటిన్నర రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. 
ఇందులో జూబ్లీహిల్స్ సొసైటీ రూ. కోటి, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ రూ.50 లక్షల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కులను సొసైటీ అధ్యక్షుడు శ్రీ టి నరేంద్ర చౌదరి, కార్యదర్శి శ్రీ టి. హనుమంతరావు తదితరులు ఇవాళ సీఎం శ్రీ కేసీఆర్ కు అందించారు. సీఎం వారికి ధన్యవాదాలు తెలిపారు.