మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 మే 2021 (19:40 IST)

తెలంగాణలో కరోనా వైరస్‌.. 3837 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71,070శాంపిల్స్‌ పరీక్షించగా.. 3837 కేసులు నమోదయ్యాయి. అలాగే, కొత్తగా 25మంది మృతిచెందగా.. 4976 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 594 కొత్త కేసులు రాగా.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 265, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 239, ఖమ్మం జిల్లాలో 227 చొప్పున నమోదయ్యాయి.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,42,67,002 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,40,603మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 4,90,620మంది కోలుకోగా.. 3,037మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం 46,946 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 90.75శాతం కాగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.