సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Updated : బుధవారం, 22 జులై 2020 (17:55 IST)

తిరుమల పెద్దజియ్యర్ స్వామిని చికిత్స కోసం హడావిడిగా తీసుకెళ్ళారు.. ఎక్కడికి?

తిరుమలను కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. టిటిడి ఉద్యోగస్తులకే కాకుండా పెద్దజియ్యర్ స్వామికి కరోనా సోకి ఆయన ఆసుపత్రిలో కాకుండా మఠంలోనే ఉంటున్నారు. మఠంలోనే వైద్య చికిత్స చేస్తున్నారు టిటిడి వైద్య సిబ్బంది. గత నాలుగురోజుల క్రితం పెద్దజియ్యర్ స్వామికి కరోనా సోకితే మొదటగా కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
 
అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పాటు చతుర్మాస దీక్షలో ఉండడంతో తాను మఠంలోనే ఉంటానని పెద్దజియ్యర్ టిటిడి ఉన్నతాధికారులను కోరడంతో ఇక చేసేది లేక మఠంలోకి తీసుకొచ్చారు టిటిడి ఉన్నతాధికారులు. 
 
గత రెండురోజుల నుంచి తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం పక్కనే ఉన్న మఠంలోనే ఆయన ఉంటున్నారు. టిటిడి వైద్యసిబ్బంది మఠంకే వచ్చి అక్కడే చికిత్స అందించి వెళుతున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం పెద్దజియ్యర్ స్వామిని ప్రత్యేక ఆంబులెన్స్ లో చెన్నైకు తీసుకెళ్ళారు.
 
టిటిడి వైద్య సిబ్బంది విషయాన్ని గోప్యంగా ఉంచుతూ అపోలో ఆసుపత్రికి పెద్దజియ్యర్ స్వామిని తీసుకెళ్ళారు. అయితే పెద్దజియ్యర్ స్వామి ఆరోగ్యంగపై ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని..ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు మఠంలోని శిష్యబృందం. హడావిడిగా తిరుపతి నుంచి చెన్నైకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు.