శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:17 IST)

దేశంలో ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో ఇప్పట్లో నియంత్రణలోకి వచ్చేలా కనిపించడం లేదు. తాజా గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,322 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ కేసులన్నింటినీ కలుపుకుంటే దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,45,907కి చేరింది. అలాగే, 24 గంటల్లో 36,385 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 330 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,225కి పెరిగింది.
 
మరోవైపు, క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,00,001 మంది కోలుకున్నారు. 4,05,681 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. 
 
ఇంకోవైపు, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మొత్తం 67,72,11,205 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క రోజే 58,85,687 డోసులు వేశారు.