మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (22:28 IST)

దేశంలో మళ్లీ కరోనా.. మాస్క్ తప్పనిసరి అవుతుందా?

face mask
భారతదేశంలో మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం తప్పనిసరి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా, కరోనా వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం, చైనా, యునైటెడ్ స్టేట్స్ సహా దేశాలలో కరోనా వైరస్ వేగంగా పెరగడం ప్రారంభించింది. దీంతో భారత్‌లో దీని ప్రభావం పెరగకముందే ముందుజాగ్రత్త చర్యలను ముమ్మరం చేస్తున్నారు. 
 
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్రాల్లో కరోనాపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. 
 
సమావేశం తర్వాత నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలందరూ మళ్లీ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేయాలి. బూస్టర్ వ్యాక్సినేషన్ తీసుకోని వారు తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. భారతదేశంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫేస్ మాస్క్‌లను మళ్లీ తప్పనిసరి చేయవచ్చని అంటున్నారు