బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (10:38 IST)

భారత్-పాక్ మ్యాచ్.. రిజర్వ్ డే ప్రకటిస్తారా? ఇంతకంటే సిగ్గుచేటు లేదు

indopak
భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడంపై టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆసియా కప్‌లో భాగంగా ఇప్పటికే ఇండో-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. 
 
ఇక ఆదివారం జరగాల్సిన మ్యాచ్ కోసం కోట్లాది మంది ప్రజలు వేచి చూస్తున్న వేళ.. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటించడాన్ని వెంకటేష్ ప్రసాద్ తప్పుబట్టాడు. సూపర్-4 లో భాగంగా రేపు (ఆదివారం) కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి.
 
రిజర్వ్ డే కారణంగా ఆదివారం కనుక వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోతే సోమవారం మ్యాచ్ ఆగిన దగ్గరి నుంచి తిరిగి ప్రారంభిస్తారు. జైషా సారథ్యంలోని ఏసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
కేవలం ఈ మ్యాచ్‌కు మాత్రమే ఎందుకని, రెండు జట్లకు వేర్వేరు నిబంధనలు ఉండడం అనైతికమని మండిపడ్డాడు. ఇంతకంటే సిగ్గుచేటు లేదని దుమ్మెత్తి పోశాడు. రెండో రోజు కూడా వర్షం కురిస్తే ఏం చేస్తారని ప్రశ్నించాడు.