సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (13:58 IST)

రాజేంద్ర నగర్‌లో అగ్నిప్రమాదం... భయాందోళనలో స్థానికులు

fire
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్ శివరాంపల్లిని స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఈ గోదాం చుట్టు పక్కల నివసించే ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా పెద్ద పెట్టున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపకదళానికి సమాచారం అందించడంతో సిబ్బంది, అగ్నిమాపక వాహనాలతో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సివుంది. 
 
రాజేంద్ర నగర్‌లో ఈ నెల ఒకటో తేదీన కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉండే డైరీ ఫామ్‌ చౌరాస్తాలోని గ్రీన్ రెసిడెన్సీ అపార్టుమెంట్ సెల్లార్‌లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో సెల్లార్‌లో పార్క్ చేసిన అన్ని వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.