మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (22:46 IST)

నెటిజన్లే అలా అడుగుతున్నారు.. కోహ్లీకి ఓడిపోవడం అంటే ఇష్టం..

కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ ఇంటిపట్టున వుంటున్నారు. హడావుడి జీవితం కోవిడ్ కారణంగా కనుమరుగైంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ఫలితంగా సెలెబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఇలా క్రికెటర్లు కూడా కుటుంబీకులతో హ్యాపీగా గడుపుతున్నారు. 
 
కరోనా కారణంగా క్రికెటర్లకు దీర్ఘకాలిక విశాంత్రి లభించింది. ముఖ్యంగా టీమిండియా సారథి కోహ్లీ తన భార్యాతో కలిసి ఎంజాయి చేస్తున్నారు. వంటలు చేస్తూ, సరదా సంభాషణలతో రోజులు గడుపుతున్నారు. వారి వివాహం తర్వాత విరుష్క జోడి ఇంతకాలం ఒకచోట ఉండడం ఇదే మొదటిసారి. వారి ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
 
ఈ క్రమంలో మంగళవారం అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పాల్గోన్నారు. విరాట్ కోహ్లీకి ఏదంటే ఇష్టం లేదని లైవ్‌లో ఓ అభిమాని అడగ్గా.. దానికి అనుష్క ఓడిపోవడం అంటే ఆయనకు ఇష్టం లేదన్నారు. అలాగే పిల్లలను ఎప్పుడు కంటారని మిమ్మల్ని ఎవరూ అడగట్లేదా అని అభిమాని అడగ్గా.. "లేదు. ఎవరూ అలా ఆగడట్లేదు. నెటిజన్లు మాత్రమే అడుగుతున్నారు' అని ఆమె బదులిచ్చారు.