గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (17:48 IST)

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అది జరిగితే అగ్రస్థానానికి పాకిస్థాన్..?

pakistan team
ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ జట్లు మూడు వన్డేల సిరీస్‌ ఆడుతున్నాయి. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన 2వ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో పాక్ జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంలో ఇరు జట్ల మధ్య 3వ, చివరి వన్డే నేడు జరగనుంది.
 
ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, పాకిస్థాన్ 2వ స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లకు 118 పాయింట్లు ఉన్నాయి. భారత్ 113 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది.