శనివారం, 25 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Kiran
Last Modified: మంగళవారం, 13 జూన్ 2017 (18:41 IST)

అనుష్కతో అదలా పంచుకుంటుంటే కన్నీళ్లొచ్చాయ్... మర్చిపోలేను... విరాట్ కోహ్లి

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, అనుష్కతో ఉన్న సంబంధం గురించి ఏనాడూ మీడియా ముందు మాట్లాడలేదు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ... అనుష్క గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని విషయాలను అన

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, అనుష్కతో ఉన్న సంబంధం గురించి ఏనాడూ మీడియా ముందు మాట్లాడలేదు. తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ... అనుష్క గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని విషయాలను అనుష్కతో పంచుకున్న సమయంలో తెలియకుండానే కన్నీరు పెట్టుకున్నానని, ఇదో మధురానుభూతి అని కోహ్లీ తెలిపారు.
 
2014లో టెస్టు సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లాం. నాతోపాటు అనుష్క ఆస్ట్రేలియా వచ్చింది. ఆ పర్యటనలో తొలి టెస్టుకి గాయం కారణంగా ధోనీ దూరమయ్యాడు. దీంతో అనుకోకుండా ఆ టెస్టుకి నేనే సారథి బాధ్యతలు నిర్వహించాను. అనంతరం మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు అనంతరం ధోనీ టెస్టు కెరీర్‌కి స్వస్తి పలికాడు. దీంతో భారత టెస్టు క్రికెట్‌ జట్టుకి పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాను. 
 
ఆశ్చర్యకరంగా నేను టెస్ట్ కెప్టెన్‌గా ఆడిన తొలిటెస్టు మెల్‌బోర్న్‌లోనూ ఆమె నాతోనే ఉందంటూ' తీపి జ్ఞాపకాలను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. అనుష్క నా పక్కన ఉన్నప్పుడే కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడం చాలా ఆనందంగా, గర్వంగా అనిపించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు బయలుదేరే ముందు విరుష్క జోడీ ‘సచిన్‌- ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రాన్ని వీక్షించిన సంగతి తెలిసిందే.
 
ఆ తర్వాత 2016లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ జరిగింది. మొహాలీలో టెస్టు జరిగే సమయంలో అనుష్క అనుకోకుండా నన్ను కలిసేందుకు వచ్చింది. ఆ తర్వాత బీసీసీఐ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఇక నుంచి భారత జట్టు వన్డే మ్యాచ్‌ల సారథి బాధ్యతలను నువ్వే నిర్వహించాలి అని చెప్పారు. వెంటనే ఈ శుభవార్తను అనుష్కతో పంచుకునేందుకు ఫోన్‌ చేశాను. ఆమెతో విషయం చెబుతూ భావోద్వేగానికి గురయ్యా. కన్నీళ్లు ఆగలేదు. ఏడ్చేశాను, అని తన ప్రేయసి అనుష్క శర్మతో తాను షేర్ చేసుకున్న ఓ గుడ్ న్యూస్ అనుభవాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. 
 
చిన్నతనంలో అకాడమీలో క్రికెట్‌ ఆడడం ప్రారంభించినప్పటి నుంచి మొహాలి టెస్టు వరకు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా వూహించలేదు అంటూ కోహ్లీ తన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు జూన్‌ 15న బంగ్లాదేశ్‌తో జరగనున్న సెమీస్ మ్యాచ్ కోసం కోహ్లీ సేన సన్నద్ధమవుతోంది.