సోమవారం, 2 అక్టోబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (09:14 IST)

కామన్వెల్త్ క్రీడల్లో సెమీస్‌కు చేరిన భారత్ మహిళా జట్టు

womens team india
కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా క్రీడా జట్టు సెమీస్‌కు చేరింది. బార్బడోస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కువ దిగిన జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంథాన్ (5), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అస్సలు పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరింది. 
 
ఆ తర్వాత వచ్చిన తానియా (6) కూడా తక్కువ స్కోరు చేసి ఔట్ అయింది. అయితే, మరో ఓపెనర్ షపాలీ వర్మ (43), రోడ్రిగ్స్ (56 నాటౌట్)తో కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లింది. 
 
ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో షెపాలీ ఔటవండంతో క్రీజ్‌లోకి వచ్చిన హర్మన్ డకౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన తానియా కూడా వెంటనే పెవీలియన్‌కు చేరడంతో జట్టు కష్టాల్లో కూరుకునిపోయిది. అయితే రోడ్రిగ్స్‌కు దీప్తి శర్మ (31 నాటౌట్)తో తోడవడంతో భారత్ నిర్ణీ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 163 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బార్బడోస్‌కు బ్యాటర్లు భారత బౌలర్ రేణుకా సింగ్ విజృంభణతో చేతులెత్తేశారు. రేణుకా సింగ్ 10 పరుగులు మాత్రమే వచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. 
 
బార్బడోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 100 పరుగుల తేడాతో విజభేరీ మోగించింది.