శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (12:56 IST)

కామన్వెల్త్ క్రీడలు - రికార్డు సృష్టిస్తున్న గురురాజ పూజారి

gururaja pujari
బర్మింగ్‌హ్యామ్ వేదికగా జరుగుతున్న కామెన్వెల్త్ క్రీడా పోటీలు 2022లో భారత్ క్రీడాకారులు రెండోరోజు కూడా తమ సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్‌తో ఖాతా తెరిచి భారత్‌కు పతకాలు అందించిన వారు.. రెండో రోజు కూడా అదే విభాగంలో పతకాలు అందించారు. 
 
ముఖ్యంగా భారత వెయిట్‌లిఫ్టర్ 28 యేళ్ల గురురాజ పూజారి పురుషుల 61 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్ట్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండో కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించిన గురురాజా మొత్తం 269 కేజీల బరువు ఎత్తాడు. ఈ విభాగంలో అజ్నిల్ బిన్ మహ్మద్ మొత్తం 285 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు.