గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 జులై 2022 (11:34 IST)

కామన్వెల్త్ క్రీడలు : పీవీ సింధుకు కరోనా సోకిందా?

pvsindhu
భారత బ్యాడ్మింటన్ జట్టులో కరోనా కలకలం రేగింది. కామన్వెల్త్ క్రీడల కోసం బర్మింగ్‌హామ్‌కు వెళ్లిన భారత జట్టులోని సభ్యుల్లో ఒకరై పీవీ సింధుకు ఈ వైరస్ సోకినట్టు అనుమానించారు. దీంతో ఆమెను ఐసోలేషన్‌కు తరలించారు. అయితే ఆమెకు రెండోసారి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
భారత జట్టులోని సభ్యులందరికీ కరోనా నెగెటివ్ పరీక్షలు నిర్వహించగా, ఒక్క సింధుకు మినహా మిగిలిన వారిందరికీ నెగెటివ్ అని వచ్చింది. అయితే, సింధు ఫలితం కాస్త తేడాగా ఉండటంతో రెండో టెస్టు ఫలితం వచ్చేంత వరకు ఆమెను ఐసోలేషన్‌లో ఉండాలని సింధుకు అధికారులు సూచించారు. 
 
ప్రస్తుతం ఆమెను వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే, రెండోసారి నిర్వహించిన ఆర్టీపీసీలో పరీక్షలో సింధుకు నెగెటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. సింధుకు కోవిడ్ సోకలేదని తేలడంతో ఆమెను కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు.