మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

'అమరేంద్ర బాహుబలి అనే నేను' అంటున్న డేవిడ్ వార్నర్

david warner
డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాడు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్. అలాంటి వార్నర్ ఇపుడు.. టిక్‌ టాక్ వీడియోలతో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తున్నాడు. కరోనా లాక్డౌన్ దెబ్బకు తన ఇంటికి పరిమితమైన వార్నర్.. పూర్తి సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతున్నాడు. అదేసమయంలో కాలక్షేపం కోసం టిక్ టాక్ వీడియోలు తీస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. ఫలితంగా అవి వైరల్ అవుతున్నాయి. 
 
అయితే, డేవిడ్ వార్నర్ ఎక్కువగా తెలుగు సినిమాపై మక్కువ చూపుతున్నారు. నిన్నామొన్న 'అల.. వైకుంఠపురములో', 'పోకిరి' చిత్రాల్లోని పాటలు, డైలాగులను వల్లెవేశాడు.
 
ముఖ్యంగా, 'అల.. వైకుంఠపురములో' మూవీలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటలకు డ్యాన్స్ వేశారు. ఆ తర్వాత పోకిరి చిత్రంలో హీరో మహేష్ బాబు చెప్పే ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అంటూ అప్పట్లో పండుగాడు చెప్పిన మాటలనే ఇపుడు డేవిడ్ వార్నర్ బ్యాటు పట్టుకుని చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. 
 
తాజాగా వార్న‌ర్.. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి' సినిమాలోని 'అమరేంద్ర బాహుబలి అనే నేను' డైలాగ్‌ను టిక్‌టాక్ వీడియోగా చేసి రిలీజ్ చేశాడు. ఈ డైలాగ్ కోసం ఏకంగా 'బాహుబ‌లి' కాస్ట్యూమ్ ధ‌రించి అందరిని అల‌రించాడు . ఈ వీడియో కూడా వైర‌ల్‌గా మారింది.