భారతదేశంలో కొత్త మోసం- జొమాటోను ఏకిపారేసిన దీపక్ చాహర్
భారత క్రికెట్ జట్టు పేసర్ దీపక్ చాహర్ శనివారం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తనకు ఎదురైన కష్టాలను వెల్లడించాడు.
ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై మండిపడ్డారు. "భారతదేశంలో కొత్త మోసం జరుగుతోంది. జొమాటో యాప్ షోల నుండి ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ అయ్యింది. కానీ చేతికి అందలేదు. కస్టమర్ సర్వీస్‌కి కాల్ చేసిన తర్వాత వారు డెలివరీ అయ్యిందని అబద్ధం చెప్పారు. చాలామంది ప్రజలు ఇదే సమస్యలను ఎదుర్కొంటారు. మీకు ఇలా జరిగితే జొమాటోకు ట్యాగ్ చేయండి, మీ కథ చెప్పండి" అని చాహర్ రాశాడు.
ఈ సమస్యపై క్షమాపణలు కోరుతూ, జొమాటో ఎక్స్‌లోని పోస్ట్‌కి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది, "హాయ్ దీపక్, మీ అనుభవం గురించి మేము తీవ్రంగా చింతిస్తున్నాము. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. నిశ్చింతగా, మేము అలాంటి సమస్యలను తీవ్రంగా పరిగణిస్తాం. దీనిపై సత్వర పరిష్కారం చేస్తాం.
" అని జొమాటో వెల్లడించింది.
దీనికి చాహర్ బదులిచ్చారు, "చాలామంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆర్డర్ డబ్బును తిరిగి ఇవ్వడం వలన సరైన చర్య తీసుకోకపోవడం వల్ల సమస్యను పరిష్కారం కాదు.. ఆకలిని డబ్బుతో భర్తీ చేయలేము." అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.